సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి..

by Vinod kumar |   ( Updated:2023-03-07 13:22:07.0  )
సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి..
X

న్యూఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ సలహా మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ కేబినెట్‌లో మంత్రులుగా నియమించారు. వారు ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ఇది అమల్లోకి వస్తుందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు వీరివురి పేర్లను కేజ్రివాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ప్రతిపాదనలు చేశారు.

ఆప్ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌ల రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అతిషి మనీష్ సిసోడియా బృందంలో కీలకంగా వ్యవహరించారు. సౌరభ భరద్వాజ్ కూడా జాతీయ ప్రతినిధిగా వ్యవహరిస్తూ, జల బోర్డ్ వైస్ చైర్మెన్‌గా ఉన్నారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీ కేబినెట్ లో సీఎంతో కలుపుకుని ఐదుగురు మంత్రులు ఉన్నారు. వీరివురికి ఇంకా శాఖలు కేటాయించాల్సి ఉంది.

Advertisement

Next Story