ప్రాసెస్‌డ్ ఫుడ్, లైఫ్‌స్టైల్ వల్లే 40 ఏళ్లలోపు భారతీయుల్లో అత్యధిక క్యాన్సర్‌ కేసులు

by S Gopi |
ప్రాసెస్‌డ్ ఫుడ్, లైఫ్‌స్టైల్ వల్లే 40 ఏళ్లలోపు భారతీయుల్లో అత్యధిక క్యాన్సర్‌ కేసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం, సరైన లైఫ్‌స్టైల్ లేకపోవడం వంటి కారణాలతో దేశంలోని 40 ఏళ్లలోపు వారిలో ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. భారత్‌లోని యువతలో క్యాన్సర్ కేసులు పెరిగేందుకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. వాటిలో ప్రాసెస్ చేసిన ఫుడ్, పొగాకు, ఎక్కువగా ఆల్కాహాల్ తీసుకోవడం, సరైన జీవనశైలి లేకపోవడం, ఊబకాయం, మానసిక ఒత్తిడి వంటిని ప్రధానాలుగా ఉన్నాయి. ఇవి కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా మరొక కీలక సమస్యగా ఉంది. దేశంలో అనేక రంగాలు అధిక కాలుష్యంతో నిండి ఉన్నాయి. దాంతో చాలామంది మధ్య వయసు వారు వివిధ రకాల క్యాన్సర్‌లతో బాఢపడుతున్నారు. ఎక్కువమంది గాలి, నీటి కాలుష్యం ద్వారానే క్యానర్స్‌ బారిన పడుతున్నారు. ఎక్కువ మొత్తంలో ఆల్ట్రా-ప్రాసెస్‌డ్ ఫుడ్ తీసుకోవడం, శారీరకంగా శ్రమ తగ్గిపోవడం వంటి అంశాలు చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చేందుకు అత్యంత ప్రధాన కారణాలుగా ఉన్నాయని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ హెమటాలజీ, బీఎంటీ విభాగం డైరెక్టర్, హెడ్ డా. రాహుల్ భార్గవ చెప్పారు. ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలి ద్వారానే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన ఎన్జీవో ముక్త్ భారత్ ఫౌండేషన్ ఇటీవల చేసిన అధ్యయనం ప్రకారం, దేశంలో ఇప్పుడు 20 శాతం క్యాన్సర్ కేసులు 40 ఏళ్లలోపు వారిలో నమోదయ్యాయి. వారిలో 60 శాతం మంది పురుషులు, మిగిలినవారు మహిళలున్నారు. పొగాకు, వృత్తిపరమైన అంశాలు, జీవనశైలి కారణంగా పురుషుల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed