- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi- Ukraine: ఆగస్టులో ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోడీ!
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తరువాత మొదటిసారిగా భారత ప్రధాని మోడీ ఉక్రెయిన్‌లో పర్యటించబోతున్నారని సంబంధిత వర్గాల వారు తెలిపారు. ఆగస్టు 23న మోడీ ఉక్రెయిన్‌కు వెళ్లి ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం అవుతారని సమాచారం. రష్యా ఉక్రెయిన్‌పై 2022లో దాడులు చేయడం ప్రారంభించన తర్వాత మోడీ మొదటిసారి అక్కడ పర్యటించనున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఇటలీలో జరిగిన G7 సమ్మిట్ సందర్భంగా మోడీ-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమయ్యారు.
తాజాగా భారత్‌లో జరగిన లోక్‌సభ ఎన్నికల్లో మోడీ గెలవడంతో జెలెన్స్కీ కాల్ చేసి అభినందించారు. ఈ ఇరువురు కూడా రెండు దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు. శాంతియుత పరిష్కారానికి మద్దతివ్వడానికి భారతదేశం తన శక్తి మేరకు మద్దతు ఇస్తుందని ప్రధాన మంత్రి ఆయనతో చెప్పారు. ఈక్రమంలో ఉక్రెయిన్‌లో పర్యటించాలని మోడీని జెలెన్స్కీ ఆహ్వనించగా, ఇప్పుడు ఆ దేశ పర్యటనకు సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే మోడీ ఈ నెల ప్రారంభంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లారు. ప్రెసిడెంట్ పుతిన్‌తో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వీరిద్దరి భేటిపై జెలెన్‌స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.