PM Modi: కొత్త సభ్యుడిని స్వాగతించిన ప్రధాని మోడీ.. వైరల్ గా మారిన వీడియో

by Shamantha N |
PM Modi: కొత్త సభ్యుడిని స్వాగతించిన ప్రధాని మోడీ.. వైరల్ గా మారిన వీడియో
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ సోషల్ మీడియా ఎక్స్ లో పంచుకున్న వీడియో వైరల్ గా మారింది. ఢిల్లీలోని తన నివాసానికి వచ్చిన "కొత్త సభ్యుడిని" స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. "మా పురాణాల్లో చెప్పపారు.. - గావ్: సర్వసుఖ ప్రదా" అని ప్రధాని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నివాసంలో ఒక ఆవు దూడకు జన్మనిచ్చింది. కాంతికి చిహ్నంగా ఆ దూడకు దీప్ జ్యోతి అని పేరు పెట్టారు. వీడియోలో ప్రధాని మోడీ ఆవుదూడకు ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.

Advertisement

Next Story