రాష్ట్రాల సీఎస్‌లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-28 15:18:01.0  )
రాష్ట్రాల సీఎస్‌లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ రహదారులు, గ్యాస్ పైపులైన్ల నిర్మాణంపై ఈ సందర్భంగా సీఎస్‌లతో చర్చించారు. ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టులపై మాట్లాడారు. అమృత్ 2.O వంటి ప్రగతి అంశాలపై ప్రధాని ఫోకస్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ పాల్గొన్నారు. కేంద్ర కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన 12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం సహా నవంబర్ నుంచి పోలవరం పనులను వేగం పెంచేందుకు మొదటి దశ ప్యాకేజీ నిధులు కీలకం కానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed