Pm modi: ఆ రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలు.. ప్రధాని మోడీ విమర్శలు

by vinod kumar |
Pm modi: ఆ రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలు.. ప్రధాని మోడీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ(congress party) పై ప్రధాని నరేంద్ర మోడీ (Pm naredra modi) తీవ్ర విమర్శలు గుప్పించారు. తన పాలనలో ఉన్న రాష్ట్రాలను ఆ పార్టీ ఆర్థిక వనరులుగా వాడుకుంటోందని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా ఆ రాష్ట్రం రాజకుటుంబానికి ఏటీఎం(ATM)గా మారుతోందని మండిపడ్డారు. మహారాష్ట్రలోని అకోలా(Akhola)లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. మహారాష్ట్రను కాంగ్రెస్ ఏటీఎంగా మారనివ్వబోమని స్పష్టం చేశారు. దేశం ఎంత బలహీనంగా మారితే కాంగ్రెస్ అంత బలపడుతుందని వారికి తెలుసు, అందుకే వివిధ కులాల మధ్య కాంగ్రెస్ విభేదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. దాని వల్ల ప్రయోజనం పొందాలని చూస్తోందని ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలోని ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(MVA) కూటమి అవినీతి మయంగా మారిందని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పర్యాయపదంగా ఉందని అభివర్ణించారు. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ (Ambedkar) రాసిన రాజ్యాంగాన్ని, కోర్టును గానీ, దేశ మనోభావాలను పట్టించుకోవడం లేదన్నారు. ‘నవంబర్ 9 తేదీ చాలా చారిత్రాత్మకమైంది. ఎందుకంటే 2019లో ఇదే రోజున దేశ అత్యున్నత న్యాయస్థానం రామాలయం(Ram Temple)పై తీర్పునిచ్చింది. ఈ తీర్పు తర్వాత అన్ని మతాలకు చెందిన ప్రజలు ఎంతో సున్నితత్వాన్ని ప్రదర్శించారు’ అని వ్యాఖ్యానించారు. ప్రజల్లో దేశ భక్తి పెరగడమే దీనికి కారణమని నొక్కి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed