కేంద్ర సర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్

by Vinod kumar |   ( Updated:2023-11-08 17:04:51.0  )
No Democracy in The Country today, Says Rahul Gandhi
X

రాయ్‌పూర్ : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌‌గాంధీ నిప్పులు చెరిగారు. ‘‘దేశ ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తానని ప్రధాని మోడీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మీకు ఆ డబ్బులు అందాయా?’’ అని సభకు హాజరైన ప్రజలను ఆయన ప్రశ్నించారు. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. ‘‘నోట్ల రద్దుతో నల్లధనం బయటికొస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. విదేశాల్లో భారతీయ సంపన్నులు దాచుకున్న నల్లధనాన్ని దేశానికి తెస్తానని ఆయన అన్నారు. ఇవన్నీ జరిగాయా? కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల జీవితాలు మారిపోతాయని ప్రధాని చెప్పారు. రైతులంతా కలిసి ఢిల్లీ సాక్షిగా ఆ బిల్లులను తిరస్కరించారు.

నిజం మాట్లాడేదెవరో.. అబద్ధాలు చెప్పేదెవరో మీకు అర్థమై ఉంటుంది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘‘బీజేపీ మిమ్మల్ని ‘వనవాసీ’ అంటుంది. మేం ‘ఆదివాసీ’ అంటాం. బీజేపీ మీ హక్కులను లాక్కుంటుంది. మేం మీకు హక్కులను కల్పిస్తాం. మేం ఆదివాసీలను అక్కున చేర్చుకుంటాం. ఓ బీజేపీ నేత ఒక ఆదివాసీపై అమానుషంగా మూత్ర విసర్జన చేసిన ఘటనను యావత్ దేశం చూసింది’’ అని ఆయన విమర్శలు గుప్పించారు.


హనుమంతుడిలా.. మీ గవర్నమెంట్‌ను మళ్లీ తెచ్చుకోండి : Priyanka Gandhi

Advertisement

Next Story

Most Viewed