PM Modi: భారత్ తటస్థ దేశం కాదు.. శాంతి కోరుకునే దేశం: పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-02-14 03:03:34.0  )
PM Modi: భారత్ తటస్థ దేశం కాదు.. శాంతి కోరుకునే దేశం: పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజుల అమెరికా (America) పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)తో ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా ద్వైపాక్షిక అంశాలు, సుంకాలు, క్రిమినల్స్ అప్పగింత, అక్రమ వలసదారులపైనే కొనసాగింది. ట్రేడ్ వార్‌కి పరిష్కారాలు, ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోన్న యుద్ధాలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ.. మోదీ తనకు మంచి స్నేహితుడని, రానున్న నాలుగేళ్లు తమ బంధాన్ని ఇలానే కొనసాగిస్తామని డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) పేర్కొన్నారు. భారత్‌కు మోదీ లాంటి నాయకుడు ఉండటం బలమైన నాయకుడు ఉండటం ఆ దేశ అదృష్టమని కొనియాడారు.

ట్రంప్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌ (India)- అమెరికా (America) వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. రెట్టింపు వేగంతో పని చేస్తామని అన్నారు. ఒకటి ఒకటి కలిస్తే.. 2 కాదు 11 అని, అదొక బలమైన సంఖ్య అని చమత్కరించారు. భారత్, అమెరికా కలయిక లోక కళ్యాణార్థం జరగాలని కామెంట్ చేశారు. భారత్ (India) తటస్థ దేశం కాదు.. శాంతిని కోరుకునే దేశమని అన్నారు. అనంతరం డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ.. భారత్‌కు చెందిన మరింత మంది క్రిమినల్స్‌ను వారి దేశానికి అప్పగిస్తామని అన్నారు. అమెరికా (America)లో అక్రమంగా భారత పౌరులు ఎవరు ఉన్నా.. వారిని వెనక్కి తీసుకుంటామని తెలిపారు. అలాంటి ఎకోసిస్టమ్‌ను మొత్తాన్ని నాశనం చేయాలని అన్నారు. ఈ భేటీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ కుమార్ దోవల్ కూడా పాల్గొన్నారు.

అంతకుముందు ప్రధాని మోదీ పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. ట్రంప్‌ 2.0 సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్‌ఎక్స్‌ సీఈవో, అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌) అధినేత ఎలాన్‌ మస్క్‌ వాషింగ్టన్‌లో మోదీతో సమావేశయ్యారు. అంతరిక్షం, సాంకేతికత, నవకల్పనలు సహా పలు అంశాలపై మస్క్‌తో చర్చించినట్లు మోదీ తెలిపారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) మైఖేల్‌ వాల్జ్‌తో పాటు భారత సంతతికి చెందిన రిపబ్లికన్‌ పార్టీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామి కూడా ప్రధాని సమావేశమయ్యారు.

Advertisement
Next Story