Lockheed Martin: సీఈవోని ప్రశంసలతో ముంచెత్తిన మోడీ

by Shamantha N |
Lockheed Martin: సీఈవోని ప్రశంసలతో ముంచెత్తిన మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ వైమానిక రంగ దిగ్గజం, లాక్ హీడ్ మార్టిన్ సీఈవో జిమ్ టైక్లెట్ ను ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister) ప్రశంసించారు. 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' విజన్‌ను సాకారం చేయడంలో జిమ్ టైక్లెట్ కీలక పాత్ర పోషించారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi), జిమ్ టైక్లెట్ తో గురువారం భేటీ అయ్యారు.ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం(PMO) ఎక్స్ వేదికగా తెలిపింది. "భారత్- అమెరికా వైమానిక, రక్షణ పారిశ్రామిక సహకార రంగాల్లో లాక్ హీడ్ మార్టిన్(Lockheed Martin) కీలక భాగస్వామి. దార్శనికతను సాకారం చేయడంలో లాక్ హీడ్ మార్టిన్ నిబద్ధతనను స్వాగతిస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా.. మేక్ ఫర్ ది వరల్డ్." అని పేర్కొంది. త్రివిధ దళాల్లో సైనిక సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు లాక్ హీడ్ మార్టిన్ దేశానికి అధునాతన రక్షణ సాంకేతికతలను అందించింది. హైదరాబాద్‌లో C 130 J రవాణా విమాన ముడిభాగాలు తయారు చేయడానికి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఇకపోతే, లాక్‌హీడ్ మార్టిన్ హెలికాప్టర్ క్యాబిన్‌ల తయారీ కోసం తన కార్యకలాపాలను జపాన్ నుంచి భారత్ కు మార్చింది. కాగా.. వైమానిక దళంలో C 130 J రవాణా విమానానిది ముఖ్యపాత్ర.

Advertisement

Next Story

Most Viewed