ఒమర్ అబ్దుల్లాతో కలిసి పని చేస్తాం.. ప్రధాని మోదీ

by Mahesh Kanagandla |
ఒమర్ అబ్దుల్లాతో కలిసి పని చేస్తాం.. ప్రధాని మోదీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీరీ ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. అలాగే.. జమ్ము కశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఒమర్ అబ్దుల్లా, ఆయన టీమ్‌తో క్లోజ్‌గా పని చేస్తుందని, సహకారం అందిస్తుందని ట్వీట్ చేశారు.

ఒమర్ అబ్దుల్లాతోపాటు ఐదుగురు కేబినెట్ మంత్రులు బుధవారం ప్రమాణం చేశారు. నౌషెరాకు చెందిన సురేందర్ చౌదరిని డిప్యూటీ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ఎంచుకున్నారు. సింగిల్ డిజిట్‌కే పరిమితమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎవరూ మంత్రిగా ప్రమాణం చేయకపోవడం గమనార్హం. అదే తరుణంలో మెజార్టీ వచ్చిన తర్వాత జేకేఎన్ఎఫ్.. కేంద్ర ప్రభుత్వంతో సానుకూల సంబంధాలను ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే తరుణంలో కశ్మీర్ పురోగతికి అండగా నిలుస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం ఒమర్ అబ్దుల్లాకు ఇది రెండోసారి. 2009 నుంచి 2014 వరకు ఆయన జమ్ము కశ్మీర్ సీఎంగా చేశారు. అబ్దుల్లా కుటుంబం నుంచి జమ్ము కశ్మీర్ సీఎంగా బాధ్యతలు తీసుకుంటున్న మూడో తరం నాయకుడు ఒమర్. ఆయన తాత షేక్ అబ్దుల్లా సీఎంగా చేశారు. తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా కూడా సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.

Advertisement

Next Story

Most Viewed