NITI Aayog: భేటీని బైకాట్ చేసిన ఇండియా కూటమి సీఎంలు

by Shamantha N |
NITI Aayog: భేటీని బైకాట్ చేసిన ఇండియా కూటమి సీఎంలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్‌ సెంటర్‌లో నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన తొమ్మిదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు ఈ భేటీలో పాల్గొన్నారు. వికసిత్‌ భారత్‌-2047 ఎజెండాగా ఈ భేటీ జరుగుతోంది. అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. వివిధ అభివృద్ధి అంశాలు, విధానపరమైన అంశాలపై చర్చ జరుపుతున్నారు. కాగా, ఈ సమావేశానికి ప్రతిపక్ష ఇండియా కూటమి(INDIA)పార్టీలకు చెందిన నేతలు హాజరుకాలేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వివక్ష చూపారంటూ నిరసిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్ విందర్ సింగ్ సుఖు ఈ భేటీని బాయ్ కాట్ చేశారు. అయితే పశ్చిమ్‌బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ఈ సమావేశానికి హాజరుకావడం గమనార్హం. బడ్జెట్‌లో తమ రాష్ట్రంపై చూపిన వివక్షను ప్రశ్నించేందుకే తాను ఈ సమావేశంలో పాల్గొంటున్నానని తెలిపారు. అలాగే ఎన్డీయే హయాంలో తీసుకువచ్చిన నీతి ఆయోగ్‌ను ఆమె రద్దు చేసి, అంతకుముందున్న ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడారు



Next Story

Most Viewed