Kerala : కేరళను ప్రత్యేక దేశంగా మారుస్తారా? : సీఎం విజయన్‌పై బీజేపీ భగ్గు

by Hajipasha |
Kerala : కేరళను ప్రత్యేక దేశంగా మారుస్తారా? : సీఎం విజయన్‌పై బీజేపీ భగ్గు
X

దిశ, నేషనల్ బ్యూరో : కేరళ ప్రభుత్వం ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. కే. వాసుకి అనే ఐఏఎస్‌ ఆఫీసర్‌ను రాష్ట్రానికి విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమించింది. దీనిపై కేరళ బీజేపీ భగ్గుమంది. విదేశాంగ శాఖ కార్యదర్శిని నియమించడం ద్వారా కేరళ సీఎం పినరయి విజయన్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కే.సురేంద్రన్ విమర్శించారు.

కేరళను ప్రత్యేక దేశంగా మార్చేందుకు సీఎం విజయన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విదేశాంగ వ్యవహారాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదన్నారు. రాజ్యాంగబద్ధం కాని ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం చాలా ప్రమాదకరమని సురేంద్రన్ పేర్కొన్నారు.ఈమేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు.



Next Story