CAMPA ఎఫెక్ట్.. తగ్గనున్న పెప్సీ, కోకాకోలా రేట్స్

by Y.Nagarani |
CAMPA ఎఫెక్ట్.. తగ్గనున్న పెప్సీ, కోకాకోలా రేట్స్
X

దిశ, వెబ్ డెస్క్: వ్యాపార రంగంలో కంపెనీల మధ్య పోటీ సహజం. ఒక కంపెనీ తమ ప్రొడక్ట్స్ పై ఆఫర్స్ ఇస్తే.. ఆటోమెటిక్ గా మరో కంపెనీకి చెందిన అదే ప్రొడక్ట్ కొనుగోళ్లు తగ్గిపోతాయి. పెప్సీ, కోకాకోలా బ్రాండ్ కూల్ డ్రింక్స్ సంస్థలకు ఇప్పుడిదే పరిస్థితి ఎదురైంది. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) తెచ్చిన సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కాంపా (CAMPA) మార్కెట్లో శరవేగంగా అమ్ముడుపోతోంది. ఆఫర్లలో డ్రింక్స్ అమ్మకానికి రావడంతో పెప్సీ, కోకాకోలా అమ్మకాలు తగ్గాయి. దీంతో ఆ సంస్థలు ధరల్ని తగ్గించాలని యోచిస్తున్నాయట. ఇప్పుడున్న ధరలపై 15-20 శాతం తక్కువ ధరకే కూల్ డ్రింక్స్ ను అమ్మాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

CAMPA ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన సాఫ్ట్ డ్రింక్ కాదు. ఒకప్పుడు దానికున్న గిరాకీనే వేరు. ఆ బ్రాండ్ ను కొనుగోలు చేసిన రిలయన్స్ సంస్థ గతేడాది మార్కెట్లో మళ్లీ రీ లాంచ్ చేసింది. తక్కువ ధరలకు విక్రయాలు ప్రారంభించి.. అధిక లాభాలు గడిస్తోంది. పెప్సీ, కోకాకోలా దీని నుంచి గట్టిపోటీను ఎదుర్కొంటూ.. తమ స్థానాన్ని కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నాయి. 500 ఎంఎల్ కాంపా బాటిల్ ధర రూ.20గా ఉంటే.. కోక్ ధర రూ.30, పెప్సికో ధర రూ.40గా విక్రయాలు జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed