పాట్నా హైకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట

by Javid Pasha |   ( Updated:2023-04-24 12:19:25.0  )
పాట్నా హైకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట
X

దిశ, వెబ్ డెస్క్: మోడీ ఇంటి పేరుకు సంబంధించిన కేసులో పాట్నా హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. మోడీ ఇంటి పేరు ఉన్న వాళ్లను అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడారని బీహార్ కు చెందిన ఎంపీ సుశీల్ కుమార్ మోడీ పాట్నా ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలోనే గత నెల ౧౮న విచారణ చేపట్టిన కోర్టు.. ఈ నెల 25న కోర్టులో హాజరు కావాలంటూ రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది.

అయితే ఇదే కేసులో తనకు ఇప్పటికే సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పు అప్పీల్ పై తాము బిజీగా ఉన్నందున విచారణ వాయిదా వేయాలని రాహుల్ కోర్టు తరఫున లాయర్లు కోర్టుకు తెలిపారు. దీంతో దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై మే 15 వరకు స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వుల జారీ చేసింది. కాగా మోడీ ఇంటి పేరు వ్యవహారంలో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు ఆధారంగా లోక్ సభ రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హుడిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read..

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీఎస్టీ ఎత్తేస్తాం.. రాహుల్ గాంధీ

Advertisement

Next Story