Waqf Properties : రాష్ట్ర ప్రభుత్వాల చెరలోని వక్ఫ్ ఆస్తులపై జేపీసీ ఫోకస్

by Hajipasha |
Waqf Properties : రాష్ట్ర ప్రభుత్వాల చెరలోని వక్ఫ్ ఆస్తులపై జేపీసీ ఫోకస్
X

దిశ, నేషనల్ బ్యూరో : అనధికారికంగా, అనుమతులు పొందకుండా రాష్ట్రాలు వినియోగిస్తున్న వక్ఫ్ ఆస్తుల(Waqf properties) సమాచారాన్ని పంపాలని వక్ఫ్(Waqf) సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. సచర్ కమిటీ నివేదికలోని సమాచారానికి, వాస్తవిక గణాంకాలకు ఉన్న తేడాతో నివేదికను అందించాలని నిర్దేశించింది.

వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ద్వారా వక్ఫ్ బోర్డులు గతంలో క్లెయిమ్ చేసుకున్న ఆస్తుల సమాచారాన్ని కూడా పంపాలని జేపీసీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు(state governments) అక్రమంగా వక్ఫ్ భూములను వాడుకుంటున్నాయని 2005-06లో పలు రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు సచర్ కమిటీకి తెలిపాయి. దీనితో ముడిపడిన సమాచారాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ నుంచి కూడా జేపీసీ సేకరిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed