గుడ్ న్యూస్.. ఇక అగ్నివీర్‌ల కుటుంబాలకూ ఆ ప్రయోజనాలు

by Hajipasha |
గుడ్ న్యూస్.. ఇక అగ్నివీర్‌ల కుటుంబాలకూ ఆ ప్రయోజనాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత సైన్యంలోని అగ్నివీర్‌లకు అనుకూలంగా కేంద్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశం కోసం విధి నిర్వహణలో అమరులయ్యే అగ్నివీర్‌ల కుటుంబాలకు.. సాధారణ సైనిక సిబ్బందికి వర్తించే ప్రయోజనాలన్నీ అందించాలని పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసు చేసింది. విధి నిర్వహణలో ప్రాణాలు విడిచే అగ్నివీరుల కుటుంబాలకు పెన్షన్ వంటి ప్రయోజనాలన్నీ అందజేయాలని తెలిపింది. ‘‘అగ్నివీరులు అమరులైతే వారి కుటుంబీకులు ఎదుర్కొనే దీనావస్థను పరిగణనలోకి తీసుకొని మేం ఈ సిఫారసులు చేశాం. సాధారణ సైనికుడి కుటుంబానికి అందించే ప్రయోజనాలన్నీ.. అగ్నివీరుల కుటుంబాలకు కూడా అందించాలి’’ అని రక్షణ శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. వాయుసేన, నౌకాదళం, ఆర్మీ సర్వీసులలో ఉన్న సైనికుల సగటు వయసును తగ్గించే లక్ష్యంతో 2022 జూన్‌‌లో అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీం‌ను కేంద్ర సర్కారు ప్రకటించింది. దీనిలో భాగంగా రిక్రూట్ చేసుకుంటున్న వారినే అగ్నివీర్‌లు అని పిలుస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed