- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ex US Security Advisor: ఉగ్రసంస్థలతో పాక్ నిఘా సంస్థకు చిక్కుముడులు
దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రసంస్థలతో పాక్ నిఘా సంస్థకు చిక్కుముడులు ఉన్నాయని అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఆర్ మెక్ మాస్టర్ అన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాక్ కు సాయం ఆపే విషయంలో విదేశాంగ శాఖ, పెంటగాన్ ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొందని అన్నారు. ఈ విషయాన్ని ‘ఎట్ వార్ విత్ అవర్ సెల్వ్స్: మై టూర్ ఆఫ్ డ్యూటీ ఇన్ ది ట్రంప్స్ వైట్‌హౌస్’ అనే పేరుతో ఆయన రచించిన పుస్తకంలో తెలిపారు. అమెరికా నుంచి పాక్‌కు ఎలా సాయం అందుతోందో వెల్లడించారు. అప్పటి రక్షణ మంత్రి జిమ్ మాటిస్ ఇస్లామాబాద్‌కు 150 మిలియన్ డాలర్ల విలువైన సాయుధ ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రయత్నించాడని అన్నారు. అందులో సాయుధ వాహనాలు కూడా ఉన్నాయి. అయితే, ట్రంప్ జోక్యం వల్లే ఆ సాయం నిలిపివేశారని వెల్లడించారు.
పుస్తకంలో ఏముందంటే?
‘‘ట్రంప్ చెప్పిన మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి పనులు చేయకుండా అమెరికా విదేశాంగశాఖ, రక్షణశాఖలను ఆపడం చాలా కష్టం. దీనిలో పాకిస్థాన్ కు అన్నిరకాల సాయాలను సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. ఏవో కొన్ని చిన్నపాటి మినహాయింపులే ఉన్నాయి. అదే సమయంలో మ్యాటిస్ ఇస్లామాబాద్ వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. మరోవైపు పెంటగాన్ కూడా పాక్ కు 150 మిలియన్ డాలర్ల మిలటరీ ప్యాకేజీని ఇచ్చేందుకు రెడీ అయ్యింది.’’ అని మెక్ మాస్టర్ పుస్తకంలో పేర్కొన్నారు. ఇది తెలిసి మెక్ స్టార్ రక్షణమంత్రి మాటిస్, సీఐఏ డిప్యూటీ డైరెకటర్ గీనా హ్సపెల్ సహా ఇతర ఉన్నతాధికారులు బేటీ అయ్యారని తెలిపారు. ఉగ్రవాదానికి పాక్ సాయపడటం ఆపే వరకు ట్రంప్ ఎలాంటిసాయం ఇవ్వొద్దని పలుమార్లు స్పష్టంగా చెప్పారని అన్నారు. “పాక్ ఉగ్ర సంస్థలు అఫ్గానీ ప్రజలను, అమెరికన్లను, బలగాలను చంపుతున్నాయి. పాక్‌కు డబ్బులు ఇవ్వొద్దని కోరుకుంటన్నానని ట్రంప్ చెప్పిన మాటలు మనం విన్నాం” అని మెక్‌మాస్టర్ చెప్పారు. ఇక మాటిస్ సాయుధ ప్యాకేజీని ఆపేసినా.. ఇతర సాయాలు మాత్రం కొనసాగించారని మెక్‌మాస్టర్ పేర్కొన్నారు.