- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pakistan: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ (Pakistan) ఛాన్స్ దొరికిన ప్రతిసారీ భారత్ పై అక్కసు వెళ్లగక్కుతోంది. ఐక్యరాజ్యసమితి(UN) వేదికగా మరోసారి జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తి మరోసారి పరువు పోగొట్టుకోంది. ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ చర్యలపై చర్చ సందర్భంగా పాక్ చేసిన అసత్య ప్రచారాన్ని భారత్ ఖండించింది.‘‘యూఎన్ సమావేశంలో పక్కదారి పట్టించేలా వ్యవహరించిన పాకిస్థాన్ (Pakistan)కు సమాధానం చెప్పే హక్కు భారత్‌కు ఉంది. జమ్మూకశ్మీర్ గతంలోనూ, ప్రస్తుతం, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. ఇటీవలే అక్కడి ప్రజలు ఓటు హక్కుని వాడుకొని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. పాక్ తన అసత్య ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలి’’ అని రాజ్యసభ ఎంపీ, బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఘాటుగా బదులిచ్చారు.
గతంలోనూ..
అంతర్జాతీయ వేదికపై బలమైన, దృఢమైన వాణి వినిపించడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైందని సుధాంశు త్రివేది అన్నారు."దృఢమైన విదేశీ విధానాల వల్ల" ఇది సాధ్యమైందన్నారు. భారతదేశం నుండి 12 మంది పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందంలో భాగం. వారు ప్రపంచ సంస్థలో విభిన్న కార్యక్రమాల కోసం ఐక్యరాజ్యసమితిని సందర్శిస్తున్నారు. గతంలోనూ పలుమార్లు యూఎన్ వేదికగా భారత్ చేతిలో పాక్ భంగపడింది. గతంలో పాక్ ప్రధాని షెహబాజ్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడిన సంగతి తెలిసింది.