Pak Violates Ceasefire: మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్

by Shamantha N |   ( Updated:2024-09-11 04:05:10.0  )
Pak Violates Ceasefire: మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపింది. సరిహద్దుల్లో భారత సైన్యంపై అకారణంగా కాల్పులు జరపడంతో భద్రతా సిబ్బంది(BSF) గాయపడినట్లు అధికారులు తెలిపారు. దీంతో, భద్రతా దళాలు కూడా ప్రతీకారం తీర్చుకున్నాయి. పాక్ సరిహద్దుల్లో కాల్పులు జరిపారు. అయితే పాకిస్థాన్ వైపు జరిగిన ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది. "బుధవారం తెల్లవారుజామున 2.35 గంటలకు నియంత్రణ రేఖ వెంబడి అఖ్నూర్ ప్రాంతంలో అనూహ్యంగా కాల్పులు జరిగాయి. దీంతో బీఎస్ఎఫ్ బలగాలు స్పందించాయి. ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ కు గాయలయ్యాయి." అని అధికారులు తెలిపారు. కాగా.. నియంత్రణ రేఖ వెంబడి నిఘా పెంచామని వెల్లడించారు. సైనికులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు.

కాల్పుల విరమణ ఒప్పందం

ఫిబ్రవరి 25, 2021న భారత్, పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించారు. అప్పట్నుంచి రెండు దేశాల మధ్య కాల్పుల ఉల్లంఘన జరగడం చాలా అరుదు. గతేడాది రామ్‌గఢ్ సెక్టార్‌లో పాకిస్థాన్ రేంజర్స్ కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్ మరణించాడు. ఆ తర్వాత కాల్పులు జరగడం ఇదే తొలిసారి. ఇకపోతే, సెప్టెంబరు 18 నుంచి మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలోకాల్పుల విరమణ ఉల్లంఘన జరగడం గమనార్హం.

Advertisement

Next Story