మారని చైనా తీరు.. ఆ ప్రాంతాలు మావేనంటూ మళ్లీ మ్యాప్ విడుదల

by Satheesh |   ( Updated:2023-08-29 07:08:11.0  )
మారని చైనా తీరు.. ఆ ప్రాంతాలు మావేనంటూ మళ్లీ మ్యాప్ విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: సరిహద్దు ప్రాంతాల విషయంలో చైనా తీరు మరోసారి బయటపెట్టింది. భారత భూభాగాన్ని తమ ప్రాంతాలుగా చూపుతూ తాజాగా చైనా సహజ వనరుల శాఖ ఎడిషన్‌ ఆఫ్‌ ది స్టాండర్డ్ మ్యాప్ ఆఫ్ చైనా-2023 పేరుతో కొత్త మ్యాప్ అధికారికంగా విడుదల చేసింది. అక్సాయిచిన్‌, అరుణాచల్‌ను తమ భూభాగంగా చూపుతున్న.. అరుణాచల్‌లోని 11 ప్రాంతాలు తమ భూభాగమే అంటూ మ్యాప్‌ తయారీ చేసింది. డిజిటల్‌, నావిగేషన్‌ మ్యాప్‌లను కూడా విడుదల చేస్తున్నట్టు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

ఈ మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొంది. కాగా, 1962 వరకు కశ్మీర్‌లో భాగంగా ఉన్న అక్సాయ్‌ చిన్‌ను డ్రాగన్‌ దేశం ఆక్రమించుకున్నది. అప్పటి నుంచి ఈ భూభాగంపై భారత్‌, చైనాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. కాగా, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రాలను కూడా చైనాలో భాగమేనని నూతన మ్యాప్‌లో పేర్కొంది. ఈ మ్యాప్ విడుదలతో ఇండియన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు బ్రిక్స్ స‌ద‌స్సులో భాగంగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం స‌హా ద్వైపాక్షిక అంశాల‌పై సంప్రదింపులు జ‌రిగాయ‌ని బీజింగ్ అధికారిక ప్రక‌ట‌న‌లో వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed