- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆధార్‌తో ఆస్తులు లింకు..?
న్యూఢిల్లీ: అవినీతి, నల్లధనం, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు ఆధార్ కార్డుకు ఆస్తులను అటాచ్ చేయాలనే పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చుకోవాల్సిందిగా సోమవారం న్యాయస్థానం కోరింది. దీనికి గానూ సీజే సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన బెంచ్ కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఇది మంచి అంశమని, అయితే ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూద్దామని తెలిపింది. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది.
ప్రభుత్వం ఆధార్‌తో ఆస్తులను అనుసంధానం చేస్తే వార్షిక వృద్ది 2 శాతం పెరుగుతుందని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఎన్నికల ప్రక్రియలో మార్పులు చోటుచేసుకుంటాయని.. బినామీ ఆస్తులు, నల్లధనం లేకుండా పోతుందని తెలిపారు. ఉగ్రవాదం, నక్సలిజం, గ్యాంబ్లింగ్, మనీ లాండరింగ్ వంటి కార్యకలాపాలకు బినామీ ఆస్తులే మూలమని ఆరోపించారు.