- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అదానీ వివాదంలో కాంగ్రెస్‌తో ఏకీభవించను.. శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అదానీ వ్యవహరంలో హిండెన్ బర్గ్ నివేదికను ఉద్దేశించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ వ్యవహరంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీచే దర్యాప్తు చేపట్టాలన్న కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీల డిమాండ్లతో ఏకీభవించలేదు. ఆ అంశానికి అనవసరమైన ప్రాధాన్యం కల్పిస్తున్నారని అన్నారు. ‘అసలు స్టేట్‌మెంట్ ఇచ్చిన ఈ వ్యక్తుల (హిండెన్‌బర్గ్) గురించి మనం ఎప్పుడూ వినలేదు.. వారి నేపథ్యం ఏమిటి? దేశమంతటా గందరగోళం కలిగించే సమస్యలను వారు లేవనెత్తినప్పుడు, దేశ ఆర్థిక వ్యవస్థ మూల్యం చెల్లించుకుంటుంది. మేము ఈ విషయాలను విస్మరించలేము. ఇది లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది’ అని పవార్ అన్నారు.
ఒకవేళ వాళ్లు తప్పు చేసి ఉంటే వారిపై విచారణ చేపట్టాలని అన్నారు. అయితే జేపీసీ ఏర్పాటు చేయాలనే విషయంలో తాను ఏకీభవించనని చెప్పారు. రాహుల్ గాంధీ అదానీ-అంబానీలను లక్ష్యంగా చేసుకోవడాన్ని తాను ఒప్పుకోనని అన్నారు. ఇది పూర్తిగా అర్థం లేనిదని, గతంలో టాటా-బిర్లా వ్యవహరం ఇలాగే జరిగిందని తెలిపారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యమైన వారికి గతంలోనూ ఇలాంటి తిప్పలు తప్పలేదని అన్నారు. కాగా, విపక్షాలన్నీ అదానీ వ్యవహరంపై చర్చకు పట్టుబడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.