- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీహార్‌లో ఘోరం!
by S Gopi |

X
పాట్నా: బీహార్‌లో ఘోరం జరిగింది. అనుమతి లేకుండా కుమారుడి విగ్రహాం నిర్మించాడనే నెపంతో తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గల్వాన్ ఘటనలో మరణించిన తన కుమారుడి స్మారకాన్ని ప్రభుత్వ భూమిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మించాడని గ్రామస్తులు ఆరోపించారు. అంతేకాకుండా విగ్రహాం మరోవైపు వెళ్లకుండా దారికి అడ్డుగా ఉందని ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విగ్రహాన్ని తొలగించాలని సూచించినప్పటికీ.. ఎలాంటి స్పందన లేకపోవడంతో సోమవారం రాత్రి సైనికుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ విజువల్స్ వైరల్‌గా మారాయి. అయితే పోలీసులు సైనికుడి తండ్రిని కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అర్ధరాత్రి వచ్చి ఉగ్రవాది తరహాలో అరెస్టు చేశారని ఆరోపించారు. గ్రామంలోని దళితుల ఫిర్యాదు మేరకు ప్రభుత్వ భూమిని ఆక్రమించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు.
Next Story