- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
J&K elections: 10 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాం.. అన్ని వర్గాల ఓట్లు మాకే: ఒమర్ అబ్దుల్లా
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ప్రారంభమైన వెంటనే నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు కోసం 10 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాం. ప్రజలు నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఓటు వేయాలని మేము కోరుకుంటున్నాము. వారంతా మా వైపే ఉన్నారు. మాకు అన్ని వర్గాల నుంచి ఓట్లు వస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన పోలింగ్ వివరాలను బట్టి మా పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అలాగే, ఈ కూటమికి సమాజ్ వాదీ పార్టీ కూడా తన మద్దతును అందించింది. అబ్దుల్లా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గందర్‌బల్, బుద్గాం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.