ఇక ప్రయాణించిన దూరానికే టోల్ వసూలు.. కేంద్రం కొత్త రూల్స్

by M.Rajitha |
ఇక ప్రయాణించిన దూరానికే టోల్ వసూలు.. కేంద్రం కొత్త రూల్స్
X

దిశ, వెబ్ డెస్క్ : టోల్ వసూలు విధానంలో కేంద్రం మరో కొత్త విధానాన్ని తీసుకు రానుంది. టోల్ ప్లాజాల వద్ద గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం ప్రకారం.. వాహనాల శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ తో కూడిన ఆన్ బోర్డ్ యూనిట్ కలిగిన వాహనాలు టోల్ ప్లాజా మీదుగా వెళ్ళినపుడు కేవలం ఆ వాహనాలు ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ ఫీజు ఆటోమేటిక్ గా ఫాస్టాగ్(Fastag) నుండి కట్ అవుతుంది. మొదట ఎంపిక చేసిన రహదారులపై ఈ విధానాన్ని అమలు చేసి, ఆ తర్వాత అన్ని జాతీయ రహదారులపై అమల్లోకి తేనున్నారు. అలాగే ఈ విధానానికి టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల ఫీజు నిబంధనలను సవరిస్తూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కొత్తగా 'జీరో టోల్ కారిడార్' ను తీసుకురానున్నారు. అంటే జాతీయ రహదారిపై 20 కిమీల లోపు ఎలాంటి టోల్ ఫీజు చెల్లించకుండా ప్రయాణించవచ్చు. అంతకు మించి ప్రయాణిస్తే ప్రయాణ దూరానికి తగ్గట్టు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. వాహనంలో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ప్రత్యేక డివైజ్ లేని వాహనాలు సాధారణ పద్దతిలోనే టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed