- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని కావాలని ఆశ లేదు.. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి..
దిశ, వెబ్‌డెస్క్: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 10న బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ క్రమంలోనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి రేసుపై తాను దృష్టి పెట్టవచ్చనే పుకార్లను ఆయన పక్కన పెట్టారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ శుక్రవారం మరోసారి ప్రధాని కావాలనే ఆకాంక్షను ఖండించారు. నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తానని, అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పని చేస్తే గొప్ప విషయం అవుతుందని, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని నితీశ్ ఉద్ఘాటించారు. ప్రధాన మంత్రి పదవిపై తనకు ఎలాంటి ఆశలు లేవని స్పష్టం చేశారు. 2014లో ఎన్నికల్లో గెలిచిన మోడీ 2024 లో గెలుపు కోసం ఆందోళన చెందక తప్పదని నితీష్ కుమార్ అన్నారు.