- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Noida: స్కూల్‌లో "నో నాన్ వెజ్ లంచ్ బాక్స్ రూల్".. వివాదాస్పదం కావడంతో మరో మెసేజ్
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో నో నాన్ వెజ్ లంచ్ బాక్స్ నియమం పెట్టారు. దీనిపై వివాదం చెలరేగడంతో ఇది కేవలం రిక్వెస్ట్ మాత్రమేనని తిరిగి మెసేజ్ పెట్టారు. నోయిడాలోని సెక్టార్-132 లోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం విద్యార్ధుల తల్లిదండ్రులను ఓ వాట్సాప్ సందేశం పంపింది. ఇందులో ఇకపై స్కూల్ లో 'నో నాన్ వెజ్ లంచ్ బాక్స్ నియమం' పెడుతున్నామని, ఈ నిబందనను అందరూ పాటించాల్సిందిగా కోరుతున్నామని చెప్పారు. దీనిపై తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పాఠశాల నియమ నిబందనలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ వాట్సాప్ మెసేజ్ పై వివాదం చెలరేగడంతో తల్లిదండ్రులకు మరో మెసేజ్ పెట్టింది.
ఇందులో "నో నాన్ వెజ్ లంచ్ బాక్స్" కేవలం అభ్యర్ధన మాత్రమేనని, ఎవరి అభీష్టం మేరకు వారు నడుచుకోవచ్చని చెబుతూ.. ఉదయం పూట మధ్యాహ్న భోజనంలో మాంసాహారం వండినప్పుడు చెడిపోయే అవకాశం ఉందని, ఇది ఆరోగ్యానికి హానికరమని చెబుతూ.. పిల్లల మధ్యాహ్న భోజనానికి మాంసాహారం ప్యాక్ చేయవద్దని తల్లిదండ్రులను కోరింది. అంతేగాక విద్యార్థుల వైవిధ్యతను పాఠశాల విలువైనదిగా భావిస్తుందని పేర్కొంది. వారి ఆహార ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా విద్యార్థులందరూ కలిసి కూర్చొని భోజనం చేయగలిగేలా, ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండే వాతావరణాన్ని అందించడంపై యాజమాన్యం దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. నోయిడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిబందన కాస్తా వివాదంగా మారడంతో వార్తల్లోకెక్కింది.