- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హేమంత్ సోరెన్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
దిశ, నేషనల్ బ్యూరో: భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణను మే 17కి వాయిదా వేసింది. లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎమెం) తరపున ప్రచార కార్యక్రమానికి వెళ్లేందుకు హేమంత్ సోరెన్ బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లభించిన బెయిల్ తరహాలోనే తనకు కూడా ఇవ్వాలని ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అరుణాబ్ చౌదరీ వాదనలు వినిపించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. మధ్యంతర బెయిల్ మంజూరుకు నిరాకరిస్తూ మే 17కు విచారణను వాయిదా వేసింది. కాగా ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ రికార్డులను మార్చి అక్రమంగా ఖరీదైన భూములను సొంతం చేసుకున్నట్టు ఆరోపణలతో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.