- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 2 వేల నోటు మార్పిడికి ఎలాంటి ఫారం అవసరంలేదు: ఎస్‌బీఐ
న్యూఢిల్లీ: ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రూ. 2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. అయితే, సోషల్ మీడ్యాలో నోట్ల మర్పిడికి సంబంధించి ఫారం నింపాలనే వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా 2000 నోట్లను మార్చుకోవడానికి గుర్తింపు కార్డు ఇవ్వాలనే ఊహాగానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ దీనిపై స్పష్టత ఇచ్చింది. ఆదివారం ట్విటర్ వేదికగా, రూ. 2,000 నోట్లను మార్చుకునేందుకు ప్రజలు ఎలాంటి ఫారంలను నింపాల్సిన పనిలేదని, బ్యాంకుల్లో నిర్దేశించిన గరిష్ఠం రూ. 20 వేల వరకు మార్చుకోవచ్చని తెలిపింది. గుర్తింపు కార్డు కూడా అవసరంలేదని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే తమ బ్యాంకు బ్రాంచులకు ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేసింది. కాగా, గత శుక్రవారం ఆర్‌బీఐ చలామణిలో ఉన్న రూ. 2,000 నోటును ఉపసంహరిస్తూ ఆదేశాలిచ్చింది. ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువును నిర్దేశించింది.
Also Read...