పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపుపై కేంద్రం క్లారిటీ

by Hajipasha |
పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపుపై కేంద్రం క్లారిటీ
X

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికలు సమీపించినందున త్వరలోనే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర సర్కారు ఖండించింది. ఆ ప్రచారంలో వాస్తవికత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి స్పష్టం చేశారు. చమురు ధరల తగ్గింపుపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో ఎలాంటి చర్చలూ జరగలేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులను లోనవుతున్న ప్రస్తుత తరుణంలో ధరల తగ్గింపు అనేది చాలా కష్టమైన వ్యవహారమన్నారు.

ఎర్ర సముద్రంలో యెమన్ హౌతీల దాడులతో..

బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎర్ర సముద్రంలో నౌకలపై యెమన్ హౌతీల దాడులు, అరబ్ దేశాల్లో యుద్ధ వాతావరణం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అమాంతం పెరిగాయన్నారు. అయినప్పటికీ భారత్‌లో ధరలు స్థిరంగానే ఉన్నాయని హర్‌దీప్‌సింగ్‌ పురి చెప్పారు. భారత్‌లో 2021 నవంబర్‌, 2022 మే నెలలో రెండు సార్లు చమురు ధరలు తగ్గిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మన దేశానికి చెందిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు లాభాలను ప్రకటించినప్పటికీ.. చమురు ధరలు గరిష్ఠంగా ఉన్న టైంలో అవి భారీ నష్టాలను మూటకట్టుకున్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు.

Advertisement

Next Story

Most Viewed