- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మోడీని ఆ విధంగా ఢీ కొడతాం.. CM Mamata Banerjee కీలక వ్యాఖ్యలు

X
దిశ, వెబ్‌డెస్క్: 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాల ఐక్యత కోసం చర్చల మధ్య బెంగాల్ సీఎం కీలక ప్రకటన చేసింది. నితీష్ కుమార్, హేమంత్ సోరెన్, ఇతర నాయకులతో కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని కీలక నిర్ణయం తీసుకున్నారు.
2024 ఎన్నికల్లో బీహార్ నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంకా చాలా మంది కలిసి వస్తామని తెలిపారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీంటితో చేతులు కలుపుతామని, మనమంతా ఒకవైపు.. బీజేపీ మరోవైపు ఉంటుందని వ్యాఖ్యనించారు. బీజేపీకి 300 సీట్ల అహంకారమే శత్రువవుతుందని, 2024లో ఆట మొదలవుతుందని విమర్శించారు. సీబీఐ, ఈడీతో మమ్మల్ని బెదిరించడానికి బీజేపీ భావిస్తోందని, ఇలాంటి ట్రిక్కులకు తాము భయపడమని తెలిపారు.
Next Story