- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర.. 8 మంది అరెస్ట్
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐసిస్ సానుభూతి పరులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా పలు కీలక నగరాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని వచ్చిన పక్కా సమాచారంతో సోమవారం నాలుగు రాష్ట్రాల్లోని 19 చోట్ల సోదాలు జరిపారు. ఈ సందర్భంగా 8 మంది సానుభూతి పరులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్క కర్ణాటకలోనే మొత్తం 11 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తుండగా.. మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీలోనూ పలు చోట్ల దాడులు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల మహారాష్ట్రలోని 40 చోట్ల అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో ఆయుధాలు, నగదు, పలు డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇవాళ అరెస్ట్ అయిన వారిలో బెల్లారి మాడ్యూల్ ఉగ్రవాద సంస్థ నేత మినాజ్ ఉన్నారు.
Advertisement
Next Story