- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'యాసిన్ మాలిక్‌కు మరణశిక్ష విధించండి'.. ఢిల్లీ హైకోర్టులో ఎన్‌ఐఏ పిటిషన్
శ్రీనగర్: కశ్మీరీ వేర్పాటువాద సంస్థ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్) నాయకుడు యాసిన్ మాలిక్‌కు మరణశిక్ష విధించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ మే 29న న్యాయమూర్తులు సిద్ధార్థ్ మృదుల్ , తల్వంత్ సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు విచారణకు రానుంది. టెర్రర్ ఫండింగ్ కేసులో 2022 మేలో స్పెషల్ ఎన్‌ఐఏ కోర్టు మాలిక్‌కు జీవిత ఖైదు విధించింది.
ఈ కేసులో అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడికి ఉరిశిక్ష విధించాలని అప్పట్లోనే ఎన్‌ఐఏ డిమాండ్ చేసింది. అయితే అసాధారణమైన కేసుల్లో మాత్రమే మరణశిక్ష విధిస్తారని ప్రత్యేక న్యాయస్థానం ఆనాడు స్పష్టం చేసింది. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 120B, 121, 121A.. యూఏపీఏలోని సెక్షన్ 17, 18, 20, 38, 39.. ఐపీసీలోని 120B.. యూఏపీఏలోని 13 మరియు 15 సెక్షన్‌ల కింద మాలిక్ వివిధ నేరాలకు పాల్పడ్డాడు.