Sanjiv Khanna : కాబోయే సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు రోల్ మోడల్ ఎవరో తెలుసా ?

by Hajipasha |
Sanjiv Khanna : కాబోయే సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు రోల్ మోడల్ ఎవరో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు(Supreme Court) తదుపరి ప్రధాన న్యాయమూర్తి(CJI)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna) నవంబరు 11న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ తరుణంలో ఆయన సుదీర్ఘ జ్యుడీషియరీ కెరీర్‌తో ముడిపడిన స్ఫూర్తిదాయక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఛార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) కావాలని ఆయన పేరెంట్స్ కోరుకునేవారు. లీగల్ ప్రొఫెషన్ టఫ్‌గా ఉంటుందని, దాని కంటే సీఏనే నయమని వారు భావించేవారు. అయితే తన అంకుల్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా స్ఫూర్తితో లా కోర్సులో జస్టిస్ సంజీవ్ ఖన్నా చేరారు. జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నాను తన రోల్ మోడల్‌గా ఎంచుకున్నారు. జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా చాలా సామాన్య జీవితం గడిపేవారు. ఆయన తన షూస్‌ను తానే పాలిష్ చేసుకునేవారట. కుటుంబంలోని ఇతరుల షూస్‌ను కూడా పాలిష్ చేసి ఇచ్చేవారట. తన దుస్తులను తానే ఉతుక్కునేవారని చెబుతుంటారు.

జస్టిస్ ఎంహెచ్ బేగ్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ 1977 జనవరిలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ వెంటనే నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా రాజీనామా చేశారు. జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నాకు చెందిన తీర్పు కాపీలు, నోట్సులు, రిజిస్టర్లు తన వద్ద ఉన్నాయని.. రిటైరయ్యాక వాటిని సుప్రీంకోర్టు లైబ్రరీకి అందిస్తానని తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులు అయ్యారు. మొదటి రోజున తన అంకుల్, మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా గతంలో సేవలు అందించిన కోర్టు రూంలోనే విధులు నిర్వర్తించారు.

Advertisement

Next Story