News Click case: మీడియా అణచివేత సరికాదు.. చీఫ్ జస్టిస్‌కు లేఖ

by Vinod kumar |
News Click case: మీడియా అణచివేత సరికాదు.. చీఫ్ జస్టిస్‌కు లేఖ
X

న్యూఢిల్లీ : మీడియా అణచివేతకు దర్యాప్తు సంస్థలను ఉపయోగించడాన్ని అంతం చేయడానికి న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని 16 పత్రికా సంఘాలు బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాశాయి. సదరు మీడియా సంస్థలన్నీ సంబంధిత లెటర్‌లో సంతకం చేశాయి. ఇక న్యూస్‌క్లిక్ కేసులో సంస్థ వ్యవస్థాపకుడు, హెచ్‌ఆర్ హెడ్‌ను క్రూరమైన ఉపా చట్టం కింద అరెస్టు చేయడంతో పాటు, 46 మంది సంబంధిత జర్నలిస్టుల ఇళ్లల్లో పోలీసులు చేసిన సోదాల గురించి ఈ లేఖలో ఉదహరించారు. వీరి నుంచి పలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పత్రికా సంపాదకులు, విలేకరులపై దేశద్రోహం, తీవ్రవాద కేసులు నమోదు చేయబడ్డాయి.

ఇలా మీడియా గొంతును నొక్కేసే ప్రయత్నం.. సమాజంలో ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుందని లేఖలో ఉద్ఘాటించారు. మీడియాకు వ్యతిరేకంగా రాష్ట్రం చేపట్టిన చర్యలు ఇప్పటికే శ్రుతి మించాయి. ఇవి ఇలాగే కొనసాగితే.. దిద్దుబాటు లేదా నివారణ చర్యలు సైతం ఆలస్యం కావచ్చు. అందువల్లే మీడియాపై దర్యాప్తు సంస్థల అణచివేత వినియోగాన్ని అంతం చేయడానికి ఇప్పుడు ఉన్నత న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని సమిష్టిగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed