CEC: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఈసీలతో భేటీ

by Shamantha N |
CEC: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఈసీలతో భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఎన్నికల కమిషన్ (ECI) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులతో సమావేశం కానుంది. మార్చి 4, 5 తేదీల్లో న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో సదస్సు జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది. సమావేశంలో పాల్గొనడానికి డీఈవో(DEO), ఈఆర్వో(ERO)లను నామినేట్ చేయాలని సీఈవోలకు (CEO)లకు సూచించినట్లు ఈసీ ప్రకటనలో పేర్కొంది. రెండు రోజుల సమావేశంలో ఎన్నికల అధికారుల అనుభవాల నుంచి పరస్పరం కొత్త విషయాలు నేర్చుకోవచ్చని పేర్కొంది. తొలిరోజు ఎన్నికల నిర్వహణలోని కీలక రంగాలైన ఐటీ సహకారం, ప్రభావవంతమైన కమ్యూనికేషన్, సోషల్ మీడియాను విస్తరించడం, ఎన్నికల ప్రక్రియల్లో పార్టీ కార్యకర్తల చట్టబద్ధమైన పాత్రపై చర్చలు ఉంటాయని పోల్ ప్యానెల్ తెలిపింది. తొలిరోజు చర్చలపై సంబంధిత కార్యచరణ ప్రణాళికను రెండోరోజు ప్రకటిస్తారంది.

Next Story

Most Viewed