Holi: హోలీ వేడుకలో న్యూజిలాండ్ ప్రధాని

by D.Reddy |
Holi: హోలీ వేడుకలో న్యూజిలాండ్ ప్రధాని
X

దిశ, వెబ్ డెస్క్: 'హోలీ హోలీలో రంగ హోలీ.. చమ్మకేళిల హోలీ' అంటూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. విదేశాల్లో ఉండే భారతీయులు కూడా హోలీ పండుగను జరుపుకుంటారని తెలిసిందే. ఈక్రమంలో న్యూజిలాండ్ (New Zealand) ప్రధాని క్రిస్టోఫర్‌ లుక్సాన్‌ (Christopher Luxon) సైతం ప్రజలతో కలిసి హోలీ ఆడారు. ఉత్సాహంగా 3, 2, 1.. అంటూ ప్రజలపై రంగులు చల్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, వాణిజ్యం, పెట్టుబడుతో సహా కీలక అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సుక్సాన్ మార్చి 16న భారత్‌కు రానున్నారు. న్యూజిలాండ్‌ ప్రధాని హోదాలో లుక్సాన్‌ తొలిసారిగా భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 20 వరకు ఆయన భారత్‌ (India)లో పర్యటించనున్నారు. తాను భారతదేశానికి పెద్ద అభిమానినని ఆయన అనేకసార్లు పేర్కొన్నారు. ఇక ప్రధాని మోడీతో చర్చలు జరపడంతో పాటు మార్చి 17న న్యూఢిల్లీలో జరగనున్న 10వ రైసినా డైలాగ్‌ ప్రారంభ సమావేశంలో క్రిస్టపర్‌ ముఖ్య అతిథిగా పాల్గని కీలక ప్రసంగం చేయనున్నారు.

Next Story

Most Viewed