Amit Shah : న్యాయం చేయడమే నూతన నేర,న్యాయ చట్టాల లక్ష్యం : అమిత్‌షా

by Hajipasha |
Amit Shah : న్యాయం చేయడమే నూతన నేర,న్యాయ చట్టాల లక్ష్యం : అమిత్‌షా
X

దిశ, నేషనల్ బ్యూరో : నూతన నేర,న్యాయ చట్టాల ప్రధాన లక్ష్యం శిక్షించడం కాదని, న్యాయం చేయడం మాత్రమేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. మూడు నేర, న్యాయ చట్టాలను అమల్లోకి తేవడమే గత పదేళ్లలో దేశంలో జరిగిన అతిపెద్ద సంస్కరణ అని ఆయన తెలిపారు. ఆదివారం చండీగఢ్‌లో ఈ-ఎవిడెన్స్, న్యాయ్ సేతు, న్యాయ్ శృతి, ఈ-సమన్స్ వ్యవస్థలను అమిత్‌షా ప్రారంభించారు. ‘‘మరో దేశపు పార్లమెంటులో పాసైన నేర న్యాయ వ్యవస్థను అమలు చేసే దేశాన్ని స్వతంత్ర దేశంగా ఎలా పరిగణించగలం ? భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను భారతీయ ప్రజాప్రతినిధులే సిద్ధం చేశారని చెప్పేందుకు నేను గర్విస్తున్నాను.

అవి భారత పార్లమెంటులోనే రూపుదిద్దుకున్నాయి’’ అని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. ‘‘కొత్త నేర,న్యాయ చట్టాల్లో శిక్షలకు సంబంధించిన నిబంధనలేవీ లేవు. న్యాయం చేయడంపైనే ఈ చట్టాలు ఫోకస్ చేస్తాయి. అందుకే ఇది పీనల్ కోడ్ కానీ జస్టిస్ కోడ్ కానీ కాదు’’ అని అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఈ చట్టాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాక భారత్ అత్యాధునిక సాంకేతికతతో కూడిన నేర న్యాయ వ్యవస్థను సంతరించుకుంటుందని ఆయన తెలిపారు. ఇందుకోసం వివిధ దశల్లో శిక్షణ, నైపుణ్యాల వికాసం కోసం కేంద్ర హోంశాఖ తోడ్పాటును అందిస్తోందన్నారు.

Advertisement

Next Story