- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీలోని మూడు ఫారెస్ట్ చెక్ పోస్టులకు నిప్పంటించిన నేపాలీలు
దిశ, నేషనల్ బ్యూరో: యూపీలోని మూడు ఫారెస్ట్ చెక్ పోస్టులకు 25 మంది నేపాలీలు నిప్పంటించారు. కతర్నియాఘాట్ లోని వన్యప్రాణుల అభయారణ్యంలోని చెక్ పోస్టులకు సోమవారం దుండగులు నిప్పు పెట్టారు. ఆ తర్వాత నిందితులందరూ నేపాల్ పారిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే, బహ్రైచ్‌లోని ఈ వన్యప్రాణుల అభయారణ్యం నేపాల్-భారత్ సరిహద్దు సమీపంలో ఉంది. గతేడాది నవంబర్ లో కొందరు నేపాలీలు ఈ ఫారెస్టులోని చెట్లను అక్రమంగా నరికివేశారు. ఈ ఆరోపణలతో పదిమంది నేపాలీలపై కేసు నమోదైంది. దీంతో, నిందితుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
అల్లకల్లోలం సృష్టించిన నేపాలీలు
శుక్రవారం రాత్రి కతర్నియాఘాట్ పరిధిలోని ధర్మాపూర్ అటవీప్రాంతంలో నేపాల్ కు చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగాడు. చెట్ల నరికివేత కేసుతో సంబంధం ఉండొచ్చనే అనుమానంతో.. అటవీ సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. చెట్ల నరికివేత కేసుతో సంబంధం లేదని.. అతడ్ని వదిలిపెట్టారు. ఈ ఘటనతో నేపాలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 నుంచి 25 మంది నేపాలీలు కతర్నియాఘాట్ లోని అటవీ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించారు. మూడు ఫారెస్ట్ ఔట్ పోస్టులకు నిప్పంటించి.. నేపాల్ పారిపోయారు. ఈ వ్యవహారంపై సీనియర్ అధికారుల ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని డీఎఫ్ఓ తెలిపారు.