NEET : నీట్ యూజీపై రాహుల్‌‌, అఖిలేష్ మొసలి కన్నీరు : ధర్మేంద్ర ప్రధాన్‌

by Hajipasha |
NEET : నీట్ యూజీపై రాహుల్‌‌, అఖిలేష్ మొసలి కన్నీరు : ధర్మేంద్ర ప్రధాన్‌
X

దిశ, నేషనల్ బ్యూరో : విపక్షాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ విపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్‌ యాదవ్ రాద్ధాంతం చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. ‘‘యూపీఏ హయాంలో, యూపీని సమాజ్‌వాదీ పార్టీ పాలించిన సమయంలో జరిగిన పేపర్ లీక్‌ల చిట్టా గురించి మేం చెప్పడం మొదలుపెడితే.. రాహుల్, అఖిలేష్ యాదవ్‌లు చిక్కుల్లో పడతారు’’ అని ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరించారు. ఈమేరకు ఆయన సోమవారం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

‘‘అప్పట్లో పేపర్ లీక్‌ల కట్టడికి యూపీఏ ప్రభుత్వం ఎందుకు చట్టం చేయలేకపోయింది ? వారిని ఆనాడు ఒత్తిడికి గురిచేసిన శక్తులు ఏమిటి ? ప్రొహిబిషన్ ఆఫ్ అన్ ఫెయిర్ ప్రాక్టీసెస్ బిల్-2010‌ను అప్పట్లో ఎందుకు అమలు చేయలేదో రాహుల్ చెప్పాలి ?’’ అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. నీట్ యూజీ పరీక్ష అవకతవకల వ్యవహారంపై ఏం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఉందని సోమవారం ఉదయం లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనికి కౌంటర్ ఇస్తూ.. ధర్మేంద్ర ప్రధాన్ పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed