NCP : 30మందితో ఎన్సీపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల జాబితా విడుదల

by Y. Venkata Narasimha Reddy |
NCP : 30మందితో ఎన్సీపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల జాబితా విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(NCP) శుక్రవారం30స్థానాలకు పోటీ చేసే అభర్థులను ప్రకటించింది. మొత్తం 70స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఐదు జాబితాలతో కాంగ్రెస్(Congres) పార్టీ మొత్తం 70మంది అభ్యర్థులను ప్రకటించింది. వరుసగా నాల్గవ సారి అధికారం కాపాడుకోవాలనుకుంటున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇప్పటికే మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ (BJP) శుక్రవారం విడుదల చేసిన జాబితాతో కలిపి 70 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది.

నామినేషన్ల దాఖలు శుక్రవారంతో ముగిసింది. 18న నామినేషన్ల పరిశీలన, 20తేదీ వరకు ఉప సంహరణ ప్రక్రియ కొనసాగనుంది. పోలింగ్ ఫిబ్రవరి 5న, కౌంటింగ్ 8న నిర్వహిస్తారు.

Next Story

Most Viewed