ఆయిల్ ట్యాంకర్ పై హౌతీల దాడి.. 22 మంది సిబ్బంది సురక్షితం

by Dishanational6 |
ఆయిల్ ట్యాంకర్ పై హౌతీల దాడి.. 22 మంది సిబ్బంది సురక్షితం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎర్రసముద్రంలో పనామా జెండాతో ఉన్న ఆయిల్ ట్యాంకర్ పై హౌతీ మిలిటెంట్లు క్షిపణి దాడి చేసిన సంగతి తెల్సిందే. అయితే ఆ నౌకలో 22 మంది భారతీయులతో సహా మొత్తం 30 మంది సిబ్బంది ఉన్నారు దీంతో వెంటనే నేవీ సహాయక చర్యలుచేపట్టింది. ఈ ఘటనపై ఐఎన్ఎస్ కొచ్చి స్పందించింది. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు అదికారులు.

ఇరాన్-మద్దతుగల హౌతీ మిలిటెంట్లు యెమెన్ న చిఎర్ర సముద్రంలోకి మూడు యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారని తెలిపింది అమెరికా. వాటిని వ్యాపార నౌక మైషా, ఎంవీ ఆండ్రోమెడ్ స్టార్ పై ప్రయోగించారని తెలిపింది యూఎస్ సెంట్రల్ కమాండ్. నౌకకు స్వల్ప నష్టం జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ నౌకను భారత నావికాదళ నౌక అడ్డగించింది. పరిస్థితిని అంచనా వేయడానికి వైమానిక మార్గనిర్దేశం చేసినట్లు తెలిపింది. నేవీకి చెందిన ఈవోడీ బృందం కూడా ఆపరేషన్ కోసం మోహరించినట్లు ప్రకటించింది నేవీ. నెక్ట్స్ పోర్ట్ కు షిఫ్ రవాణా సాగిస్తుందని తెలిపింది.

ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో హమాస్‌కు మద్దతుగా యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు.

భారత్‌కు వస్తున్న ‘ఆండ్రోమెడా స్టార్’ అనే చమురు ట్యాంకర్‌ నౌకపై హౌతీ రెబల్స్‌ క్షిపణితో దాడి చేశారు. ఈ విషయాన్ని హౌతీ తిరుగుబాటుదారులే శనివారం ప్రకటించారు. పనామా జెండా ఉన్న నౌకపై దాడి చేసినట్లు హౌతీ ప్రతినిధి యాహ్యా సరియా తెలిపారు. ఈ దాడిలో నౌకకు నష్టం వాటిల్లినట్లు బ్రిటిష్‌ సముద్ర భద్రతా సంస్థ ఆంబ్రే తెలిపింది. ఇటీవలే ఈ నౌకను విక్రయించినట్టు షిప్పింగ్ డేటా ద్వారా తెలుస్తోంది. ఈ నౌక రష్యాలోని ప్రిమోర్క్‌ నుంచి గుజరాత్‌లోని వడినార్‌కు వెళ్తుండగా దాడి జరిగినట్లు ఆంబ్రే తెలిపింది.

Next Story

Most Viewed