బీజేపీకి ఓటేస్తే నేను మరోసారి జైలుకెళ్లడం ఖాయం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

by samatah |
బీజేపీకి ఓటేస్తే నేను మరోసారి జైలుకెళ్లడం ఖాయం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే తాను మరోసారి జైలు కెళ్లడం ఖాయమని తెలిపారు. అందుకే ఆప్‌కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. హర్యానాలోని కురుక్షేత్రలో మంగళవారం నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. ‘నేను ఢిల్లీలో అన్ని మందులు ఉచితంగా ఇచ్చాను. షుగర్ పేషెంట్‌ అయిన నేను ప్రతి రోజూ 52 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటాను. కానీ జైలుకు వెళ్ళినప్పుడు నాకు15 రోజులు ఇన్సులిన్ ఇవ్వలేదు. అక్కడ ఎంతో ఇబ్బంది పడ్డాను. కాబట్టి మీరు బీజేపీకి ఓటేస్తే మరోసారి జైలుకు వెళ్తాను. ఆప్‌కు ఓటేస్తే వెళ్లాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘మార్చి16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే..2వ తేదీనే నన్ను జైలులో పెట్టారు. ఈ వ్యవహారం చూస్తుంటే కేజ్రీవాల్ అంటే బీజేపీ భయపడుతోందని స్పష్టంగా అర్థమవుతుంది’ అని తెలిపారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌కు ఇటీవలే మధ్యంతర బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. జూన్ 1వ తేదీ వరకు ఆయనకు బెయిల్ గడువు ఉంది. జూన్ 2వ తేదీన లొంగిపోవాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed