- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Navodaya Admit cards: నవోదయ ఎంట్రెన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డులు రిలీజ్.. డౌన్‌లోడ్ లింక్ ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న 653 జవహర్ నవోదయ విద్యాలయాల్లోని(Jawahar Navodaya Vidyalaym) ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే జవహర్ నవోదయ ఎంపిక పరీక్ష-2025 నోటిఫికేషన్ ప్రక్రియ ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 18న ప్రవేశ పరీక్షను(Entrance Test) నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఈ పరీక్షకు సంబధించి అడ్మిట్ కార్డుల(Admit cards)ను నవోదయ విద్యాలయ సమితి తాజాగా విడుదల చేసింది. అప్లై చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://cbseitms.rcil.gov.in/nvs/ లో తమ రిజిస్ట్రేషన్ నంబర్(Registration No), డేట్ ఆఫ్ బర్త్(Date of Birth) వివరాలను ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా వచ్చే ఏడాది మార్చిలో నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ తుది ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్(Free Education)తో పాటు, బాల బాలికలకు వేర్వేరు హాస్టల్(Hostel Accommodation), ఫుడ్(Food) సౌకర్యాలు కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్(AP)లో 15, తెలంగాణా(TG)లో 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.