- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Russia's : రష్యా అణ్వస్త్ర ప్రయోగాల పరీక్షలతో అప్రమత్తమైన నాటో
దిశ, వెబ్ డెస్క్ : రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ ల యుద్ధాని(Russia-Ukraine war)కి మరింత ఆజ్యం పోసే రీతిలో రష్యా ఏకంగా మూడు అణ్వస్త్రా ప్రయోగ క్షిపణుల(Nuclear weapons)ను పరీక్షించి ప్రపంచ దేశాలను నివ్వెర పరిచింది. జలాంతర్గాముల నుంచి రెండు రాకెట్లు, భూ ఉపరితలం నుంచి మరో అణ్వస్త్రా రాకెట్ ప్రయోగించింది. రష్యా తాజాగా నిర్వహించిన న్యూక్లియర్ డ్రిల్ అవసరమైతే ఉక్రెయిన్ పై అణ్వస్త్ర ప్రయోగానికేనా అన్న సందేహాలను రెకెత్తించాయి. రష్యా చేపట్టిన అణ్వస్త్రాల ప్రయోగ పరీక్షల నేపథ్యంలో నాటో కూటమి అప్రమత్తమైంది. ఇప్పటికే ఉక్రెయిన్ తో పోరాడేందుకు ఉత్తర కోరియా తన సైనిక దళాలను రష్యాకు పంపింది. ఈ నేపథ్యంలో రష్యాలోని లోతైన లక్ష్యాలను ఛేదించగల సుదూర శ్రేణి క్రూయిజ్ క్షిపణులను ఉక్రెయిన్ కు అందించాలని యుఎస్ తో సహా పాశ్చాత్య దేశాలు సిద్ధమయ్యాయి. నాటో దేశాల మద్దతుతో ఉక్రెయిన్ తన ఆయుధ సామర్ధ్యాన్ని పెంచుకుంటే స్వీయ రక్షణకు అణ్వాయుధాలను ఉపయోగించడానికి వెనుకాడమన్న సందేశాన్ని పశ్చిమ దేశాలకు ఇచ్చేందుకే తాజాగా రష్యా అణ్వస్త్రా క్షిపణి ప్రయోగాలను చేపట్టిందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. రష్యాపై దాడులు చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఇచ్చిన లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే, రష్యాపై నాటో యుద్దం ప్రారంభించినట్లుగా భావించాల్సి వస్తుందని గతంలోనే పుతిన్ హెచ్చరించారు.
పుతిన్ ఈ తరహా సైనిక విన్యాసాలు ప్రారంభించడం రెండు వారాల్లో ఇది రెండోసారి. రష్యా బలగాలు చివరి సారిగా ఈ ఏడాది అక్టోబర్ 18న అణు విన్యాసాలు నిర్వహించాయి. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలలో 88శాతం రష్యా, యుఎస్ నియంత్రణలో ఉన్నాయి. రష్యా, నాటో మధ్య ప్రత్యక్ష వివాదం ఏర్పడితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గతంలోనే హెచ్చరించారు. రెండేళ్లుగా యుద్ధం సాగుతోన్నప్పటికి ఉక్రెయిన్ రష్యాకు లొంగకపోవడంతో ఉక్రెయిన్ ను నాశనం చేయాలని రష్యా భావిస్తోంది. తాజాగా న్యూ క్లియర్ డ్రిల్ ప్రారంభించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల వినియోగంతో సహా అణ్వాయుధాలను అత్యంత అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే ఉపయోగిస్తామని, అయితే వాటిని ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మేము కొత్త ఆయుధ పోటీలో పాల్గొనాలని కోరుకోవడం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే రష్యా అణ్యస్త్రా ప్రయోగ పరీక్షలు నాటో దేశాలను కలవరపరుస్తున్నాయి.