631 మంది సైనికుల పేర్లు టాటూలుగా.. గిన్నిస్ రికార్డులో..

by Sathputhe Rajesh |
631 మంది సైనికుల పేర్లు టాటూలుగా.. గిన్నిస్ రికార్డులో..
X

దిశ, వెబ్‌డెస్క్: అమర సైనికులకు పూల బొకేలు, కొవ్వొత్తుల నివాళి ఇవ్వడం చూస్తుంటాం. కానీ సైనికుల మీద ఉన్న అభిమానాన్ని ఓ వ్యక్తి వినూత్నంగా చాటుకున్నాడు. అమరులైన 631 మంది సైనికుల పేర్లను టాటూలుగా వేయించుకున్నాడు. కార్గిల్ వార్ లో ప్రాణాలు విడిచిన సైనికుల త్యాగానికి చిహ్నంగా ఇలా చేసినట్లు యూపీ లోని వారణాసికి చెందిన ఇంటీరియర్ డిజైనర్ పండిత్ అభిషేక్ గౌతమ్ తెలిపాడు.

తద్వారా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. అమరుల ఇళ్లను సైతం సందర్శిస్తున్న అభిషేక్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు 559 మంది అమర సైనికుల కుటుంబాలను కలిసినట్లు ఆయన తెలిపారు. అభిషేక్ తనను తాను కదిలే అమరుల మెయోరియల్ గా వర్ణించుకుంటున్నాడు. పేర్లతో పాటు ఇండియా గేట్, షహీద్ స్మారక స్థూపాన్ని తన ఒంటిపై టాటూగా వేయించుకున్నాడు.

Advertisement

Next Story