- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మిజోరంలో కుప్పకూలిన మయన్మార్ ఆర్మీ విమానం
by samatah |

X
దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్‌కు చెందిన ఆర్మీ విమానం మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో మంగళవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారని మిజోరం డీజీపీ తెలిపారు. ఘటన సమయంలో విమానంలో ఫైలట్‌తో సహా 14 మంది ఉన్నట్టు వెల్లడించారు. గాయపడిన వారిని లెంగ్‌పుయ్ ఆస్పతికి తరలించారు. ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన మయన్మార్ ఆర్మీ సిబ్బందిని తీసుకెళ్లేందుకు ఈ విమానం మిజోరం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపైకి దూసుకెళ్లి డ్యామేజ్ అయినట్టు సమాచారం. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా, జవవరి 17న భారత్‌కు వచ్చిన 276 మంది మయన్మార్ సైనికుల్లో 184 మందిని ఇప్పటికే మయన్మార్‌కు పంపించగా..మరో 92 మందిని తరలించాల్సి ఉంది.
Next Story