నా 90 సెకన్ల ప్రసంగంతో ఇండియా కూటమిలో ప్రకంపనలు- ప్రధాని మోడీ

by Shamantha N |   ( Updated:2024-04-23 14:28:39.0  )
నా 90 సెకన్ల ప్రసంగంతో ఇండియా కూటమిలో ప్రకంపనలు- ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. మహిళల మంగళసూత్రాలపై మోడీ చేసిన వ్యాఖ్యలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ చిచ్చు రేపాయి. కాగా.. ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూనే మరోసారి హస్తం పార్టీపై విరుచుకుపడ్డారు మోడీ. కాంగ్రెస్ కుట్రను తాను బయటపెట్టడంతో ఆ పార్టీలో ఆందోళన మొదలైందన్నారు. రాజస్థాన్ లోని టోంక్ ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగించారు. తన ప్రసంగంతో కాంగ్రెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయని విమర్శించారు.

ఇటీవలే రాజస్థాన్‌ వచ్చినప్పుడు తన 90 సెకన్ల ప్రసంగంలో కొన్ని నిజాలను దేశప్రజల ముందుంచా అని అన్నారు మోడీ. తన ప్రసంగానికి కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలో భయాందోళనలు సృష్టించాయని తెలిపారు. ప్రజల సంపల లాక్కొని వాటిని చొరబాటుదారులకు పంపిణీ చేసే కుట్ర పన్నుతోందని తెలిపారన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలను బయటపెట్టానని స్పష్టం చేశారు. నిజాలు చెప్తే కాంగ్రెస్ ఎందుకు అంత భయపడుతోంది? అని అడిగారు మోడీ.

2014లో దేశ సేవే చేసేందుకు తనకు అనుమతిని ఇచ్చారని మోడీ అన్నారు. ఆ తర్వాత ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకని విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. ఒకవేళ, 2014 తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. ఏం జరిగేదో ఆలోచించాలని అని అన్నారు మోడీ. జమ్ముకశ్మీర్ లో ఉన్న భారత బలగాలపై ఇప్పటికీ రాళ్లు రువ్వుతూ ఉండేవారని పేర్కొన్నారు. శత్రువులు సరిహద్దులు దాటుకుని దేశంలోకి చొచ్చుకువచ్చేవారన్నారు. భారత సైనికుల కోసం వన్ ర్యాంక్.. వన్ నేషన్ అమలు జరిగేది కాదన్నారు. మాజీ జవాన్లకు రూ.లక్ష కోట్లు అందేవి కావని గుర్తుచేశారు.

కాంగ్రెస్ ఆలోచనలు ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో అధికారంలోకి వచ్చాక.. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు తగ్గించి వాటిని ముస్లింలకు కేటాయించిందన్నారు. ఇదో పైలట్ ప్రాజెక్టు అయినప్పటికీ.. దీన్ని దేశమంతా అమలుచేసేందుకు ప్రయత్నించేదన్నారు. 2004- 2010 మధ్య కాలంలో ఏపీలో నాలుగు సార్లు ముస్లిం రిజర్వేషన్లను అమలుచేసేందుకు యత్నించిందన్నారు. కానీ, రాజ్యాంగానికి వ్యతిరేకమైనదని.. చట్టపరమైన అడ్డంకుల కారణంగా అది సాధ్యం కాలేదని ఆరోపించారు. దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులకు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ హక్కును ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుందని నిప్పులు చెరిగారు. దళితులు, వెనుగబడిన తరగతులు, గిరిజనులకు రిజర్వేషన్లు అంత కాబోవని మోడీ హామీ ఇచ్చారు. మతం పేరుతో ప్రజలను విభజించేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు.

Read More...

అంబేద్కరే వచ్చి అడిగినా అది జరగదు..ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు?

Advertisement

Next Story

Most Viewed