మందుబాబులకు షాక్.. 17 పట్టణాల్లో మద్య నిషేధం

by John Kora |
మందుబాబులకు షాక్.. 17 పట్టణాల్లో మద్య నిషేధం
X

- పుణ్యక్షేత్రాల్లో వైన్ షాపుల మూసివేత

- మధ్యప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం

దిశ, నేషనల్ బ్యూరో:

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న 17 పుణ్యక్షేత్రాల్లో మద్య నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలోని మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో ఒక మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు పలు నగర పరిషత్, నగర పంచాయతీల్లో మద్య నిషేధం అమలులోకి రానుంది. ఈ నగరాలు, పట్టణాలు, గ్రామల్లో మద్య నిషేధం పూర్తిగా అమలు జరుగుతుందని, భవిష్యత్‌లో కూడా దుకాణాలకు అనుమతులు ఇవ్వబోమని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు దాతియా, పన్నా, ముల్తాయ్, మాందాసౌర్, మైహర్ నగరపాలికల్లో నిషేధం అమలులోకి రానుంది. ఇక ఓంకారేశ్వర్, మహేశ్వర్, మండ్లేశ్వర్, ఓర్చా, చిత్రకూట్, అమర్‌కంటక్ నగర పరిషత్‌లలో, సల్కాన్‌పూర్, బర్మన్ కాలా, లింగా, బర్మన్ కుర్ద్, కుందల్‌పూర్, బందక్‌పూర్ పంచాయతీల్లో నిషేధం అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. నర్మదా నదికి ఇరు వైపులా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మద్య నిషేధాన్ని కొనసాగిస్తామని, అందులో ఎలాంటి మార్పు లేదని సీఎం యాదవ్ వివరించారు.

Next Story