- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Breaking News : రాజకీయాల్లో సంచలనం.. అత్యాచార ఘటనలో ఎంపీ అరెస్ట్

దిశ, వెబ్ డెస్క్ : యూపీ రాజకీయాల్లో(UP Politics) సంచలన పరిణామం చోటు చేసుకుంది. అత్యాచార ఆరోపణలతో ఏకంగా ఎంపీని అరెస్ట్(MP Arrest) చేయడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోను పెను దుమారం రేపింది. లఖన్ పూ(Lakhanvoo)కు చెందిన కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్(MP Rakesh Rathore) పై అత్యాచార కేసు(Rape Case) నమోదైంది. దీనిపై రాకేశ్ రాథోడ్ అలహాబాద్ హైకోర్ట్(Alahabad High Court) లో బుధవారం బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసినప్పటికీ కోర్ట్.. ఆ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసుపై సీతాపూర్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, అత్యంత కట్టు దిట్టమైన భద్రత మధ్య కోర్టుకు తీసుకు వెళ్లారు. కాగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎంపీ రాకేశ్ రాథోడ్ నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ఓ యువతి జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్ లు కూడా పోలీసులకు సమర్పించింది.
బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఎంపీకి నోటీసులు పంపగా.. సదరు ఎంపీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే దానిని జిల్లా కోర్ట్ తిరస్కరించగా.. బుధవారం అలహాబాద్ హైకోర్ట్ లఖన్ వూ బెంచ్ లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. బెంచ్ దానిని కొట్టివేసింది. ఈ ఘటనపై ఎంపీ రాకేశ్ గురువారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి.. తాను అమాయకుడిని అని, కావాలనే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుతుండగానే.. భారీ బందోబస్తుతో వెళ్ళిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఎలాంటి అల్లర్లు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. అయితే పదవిలో ఉన్న ఓ ఎంపీ అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ కావడం ప్రస్తుతం యూపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. దీనిపై బీజేపీ విరుచుకు పడుతుండగా.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.